calender_icon.png 20 July, 2025 | 1:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిఘా నేత్రం నీడలో చందుర్తి పోలీస్ స్టేషన్

19-07-2025 01:33:37 AM

రాజన్న సిరిసిల్ల: జూలై 18 (విజయక్రాంతి)చందుర్తి పోలీస్ స్టేషన్ పరోధిలోని క్రిష్టంపెట్ గ్రా మంలో ఏర్పాటు చేసిన 09 సీసీ కెమెరాలను,పోలీస్ అధికారులు , గ్రామప్రజలు,ప్రజాప్రదినిధులతో కలసి ప్రారంభించిన జిల్లా ఎస్పీ.గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి గ్రామ స్తులు ముందుకు రావడం అభినందనియమని మిగిలిన గ్రామ ప్రజలు కూడా స్వీయారక్షణ కో సం గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని జిల్లా ఎస్పీ ప్రజలకు పిలుపునిచ్చారు.

అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.... సీసీ కెమెరాల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని, గ్రా మంలో ఏ చిన్న సంఘటన జరిగినా సీసీ కెమెరాల ద్వారా వెంటనే తెలుసుకోవచ్చని,గ్రామాల్లో సీసీ కెమెరాలు మరింత భద్రత కల్పిస్తాయని,సీసీ కెమెరాల ద్వారా ఈమధ్యకాలంలో చాలా కే సులు చేదించడం జరిగిందని తెలిపినారు.కేసుల ఛేదన సమయంలో సీసీ కెమెరాలు సాక్ష్యంగా ఉపయోగపడతాయని తెలిపారు గ్రామంలో రాత్రింబవళ్లు 24 గంటలు ప్రజలకు రక్షణగా నిలుస్తాయని,పోలీస్ స్టేషన్ పరిధిలోని సీసీ కెమెరాలు లేని గ్రామల ప్రజలు సీసీ కెమెరాలు ఏర్పాటు గురించి ముందుకు వచ్చి పోలీస్ పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు.

ప్రతి ఒక్కరూ సిసి కె మెరాల ఏర్పాటుకు ముందుకు రావడం ద్వారా నేర రహిత సమాజ నిర్మాణం సాధ్యమని ఆ యన చెప్పారు.గ్రామాల్లో అనుమానంగా సంచరించే వ్యక్తుల సామాచారం,గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాల సమాచారం పోలీస్ వారికి అందించాలన్నారు. ప్రజలు యువకులు ప్రతి ఒక్కరు ట్రాఫిక్, రోడ్ భద్రత నియమ నిబంధనలు పాటించాలన్నారు.సనుగుల గ్రామంలో కల. గోవిందరాజుల స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన జిల్లా ఎస్పీ సి.ఐ వెం కటేశ్వర్లు,ఎస్.ఐ రమేష్,గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు,పోలీస్ సిబ్బంది ప్రజలుపాల్గొన్నారు.