19-07-2025 01:35:25 AM
- ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై పోలీస్ కమిషనర్ చూపు
- అక్రమ కట్టడాలపై మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సీరియస్
- అధికారుల చర్యలపై నగర వాసుల హర్షం
కరీంనగర్, జూలై18(విజయాక్రాంతి): కరీంనగర్ నగరంపై ఆ ఇద్దరు కమిషనర్ లు స్పెషల్వ్ ఫోకస్ పెట్టారు. ట్రాఫిక్ క్రమబద్దీకరణ పై పోలీస్ కమీషనర్ గౌస్ అలం , అ క్రమనిర్మాణాల తొలగింపు పై నగరపాలక సంస్థ కమిషనర్ ప్రపూల్ దేశాయిలు దృష్టి సారించడం శుభ పరిణామం అంటున్నారు నగరవాసులు. స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్లో భాగంగా కరీంనగర్లో ఏర్పాటు చేసిన 769 సీసీటీవీ కెమెరాలు జూన్ 27, 2025 నుండి పూర్తిగా అందుబాటులోకి వచ్చయి, ఈ కెమెరాల ద్వారా ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలను పర్యవేక్షిస్తూ, తదనుగుణంగా చలాన్లు జారీ చేస్తున్నారు.
పౌరుల భద్రతను పెంచడం, రోడ్డు ప్రమాదాలను నివారించడం నగరం లో ట్రాఫిక్ను నియంత్రించడం అని పోలీస్ కమిషనర్ తెలిపారు.ట్రాఫిక్ సిగ్నల్ దాటి ముందుకు వెళ్లడం.కారు నడుపుతున్నప్పుడు సీట్ బెల్ట్ ధరించకపోవడం, వ్యతిరేక దిశలో డ్రైవింగ్.,డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సెల్ ఫోన్ ఉపయోగించడం. ఒకే ద్విచక్ర వాహనంపై ముగ్గురు వ్యక్తులు ప్రయాణించడం. చాలా వేగంగా లేదా ప్రమాదకరమైన వేగంతో వా హనాన్ని నడపడం.లాంటి ట్రాఫిక్ నిబంధనలలో దేనినైనా ఉల్లంఘించినందుకు వా హనదారులకు ట్రాఫిక్ చలాన్లు జారీ చేస్తున్నారు.
జూన్ 27వ తేదీ నుండి ఇప్పటి వర కుట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన 13, 869 మందిపై కేసులు నమోదు కాగా, ఈ కేసుల్లో రూ. 1,13,43,400 జరిమానాలు వి ధించబడ్డాయి.ప్రస్తుతానికి హెల్మెట్ లేకుం డా బైక్ నడపడం, ఓవర్ స్పీడ్ డ్రైవి్ంప జరిమానాలు విధించట్లేదని, ఇతర శాఖల సమ న్వయంతో త్వరలో అవి కూడా అమలు చేస్తామని పోలీస్ కమీషనర్ తెలిపారు. తాజాగా చేపట్టిన చర్యల వల్ల ట్రాఫిక్ క్రమబద్దీకరణకి మార్గం సుగమ మయింది.
-----రోడ్డు ఆక్రమణల పై ఉక్కు పాదం
-----రోడ్లు, ఫుట్ పాత్ ఆక్రమణల తొలగింపు పై నగరపాలక సంస్థ స్పెషల్ డ్రైవ్ ప్రారంభించింది. కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ ఈ మేరకే స్పెషల్ నజర్ పెట్టారు. టౌన్ ప్లానిం గ్, ట్రాఫిక్ పోలీసు అధికారులు, డిఆర్‌ఎఫ్, పారిశుధ్య అధికారులు సిబ్బంది తో కలిసి కమీషనర్ ఎంక్రోజ్ మెంట్స్ పై డ్రైవ్ ను ప్రారంభించారు.
గత సోమవారం మొదటి రోజు నగరంలోని తెలంగాణ చౌక్ ( గీతాభవన్ చౌరస్తా) నుండి పద్మానగర్ వరకు రో డ్లు, ఫుట్ పాత్ లను ఆక్రమించి వ్యాపారం చేస్తున్న ఆక్రమణలను తొలగించి వేశారు. ఈ ప్రక్రియ ప్రాంతాల వారిగా కొనసాగిస్తున్నారు.ఫుత్ పాత్ లు, రోడ్లను ఆక్రమించి వ్యాపారం చేయరాదని దుకాణదారులను కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ ఈ సందర్బంగా హెచ్చరిఇస్తున్నారు.