ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ షెడ్యూల్లో మార్పు
- జూలై 4 నుంచి తొలి విడుత ప్రక్రియ షురూ
- 19న ఫస్ట్ ఫేజ్ సీట్లు కేటాయింపు
హైదరాబాద్, జూన్ 25 (విజయక్రాంతి): తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో బీటెక్/బీఈ, అగ్రికల్చర్, ఫార్మసీ సీట్ల భర్తీకి నిర్వహించే టీజీ ఎప్‌సెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్లో మార్పు లు చోటుచేసుకున్నాయి. ముంద స్తు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 27 నుం చి ప్రారంభం కావాల్సిన కౌన్సిలింగ్ ప్రక్రి య వాయిదా పడింది. జూలై 4 నుంచి ఇంజినీరింగ్ తొలి విడుత కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. జూలై 6 నుంచి 13 వరకు తొలి విడుత సర్టిఫికెట్ వెరిఫికేషన్, జూలై 8 నుంచి 15 వరకు ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్లకు అవకాశం, జూలై 19న తొలివిడుత సీట్లను కేటాయించనున్నారు.
జూలై 26 నుంచి సెకండ్ ఫేజ్...
జూలై 26 నుంచి ఇంజినీరింగ్ రెండో విడుత కౌన్సిలింగ్ జరగనుంది. అదే నెల 27న రెండో విడుత కౌన్సిలింగ్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియను చేపట్టనున్నారు. జూలై 27, 28 తేదీల్లో రెండో విడుత వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. జూలై 31న రెండో విడుత సీట్లను అభ్యర్థులకు కేటాయిస్తారు. ఇక ఆగస్టు 8 నుంచి మూ డో విడుత కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభిస్తారు. ఆగస్టు 9న సర్టిఫికెట్ వెరిఫికేషన్, 9, 10 తేదీలలో వెబ్ ఆప్షన్లకు అవకాశం, ఆగస్టు 13న మూడో విడుత సీట్లను కేటాయిస్తారు. ఇక అదే నెల 21 నుంచి కన్వీనర్ కోటా ఇంటర్నల్ స్లుడింగ్‌కు అభ్యర్థులకు అవకాశం కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే ఈ విద్యాసంవత్సరానికి కళాశాలలకు సంబంధించి అఫిలియేషన్ ప్రక్రియ ఇంకా పూర్తి కాకపోవడంతో కౌన్సిలింగ్ షెడ్యూల్లో మార్పు లు చేసినట్లుగా తెలుస్తోంది.






