వాంగ్మూలం తీసుకుని చర్యలా..?
17-09-2025 12:00 AM
- పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా మాజీ సీఎస్‌పై చర్యలు తీసుకోవద్దు
- రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశం
- కాళేశ్వరం అవినీతి కేసులో ఎస్‌కే జోషీకి ఊరట
హైదరాబాద్, సెప్టెంబర్ 16: కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కేసులో సాక్షిగా మాత్రమే మాజీ సీఎస్ ఎస్‌కే వాంగ్మూలం తీసుకుని.. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు ఎలా తీసుకుంటారని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. కనీసం నోటీసులు కూడా జారీ చేయలేదని, తనపై చర్యలు చేపట్టొద్దని మాజీ సీఎస్ ఎస్‌కే జోషి ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై మంగళవారం విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం మాజీ సీఎస్‌పై చర్యలు చేపట్టొద్దని ఆదేశాలు జారీ చేస్తూ విచారణను వాయిదా వేసింది. దీంతో మాజీ సీఎస్‌కు హైకోర్టులో ఊరట లభించింది.






