10 April, 2026 | 3:54 PM

Breaking News

టూ వీలర్ తో మెకానిక్ చేస్తూ... ఉపాధి   •   అన్నా.. నన్ను దేవుడే పంపిండు— కేసీఆర్‌ను కలిసి జీవన్ రెడ్డి భావోద్వేగం   •   ఉపాధి హామీ పనులు వేసవిలో ఉదయం పూట చేసుకోవాలి   •   'ఇజ్రాయెల్ ఒక క్యాన్సర్ దేశం' — పాకిస్థాన్ రక్షణ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు   •   క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు   •   ఫార్మా కంపెనీలో గాయపడిన కార్మికులకు అండగా ఉంటాం   •   అమెరికా, ఇరాన్ శాంతి చర్చలపై కమ్ముకున్న నీలినీడలు   •   తల్లి ఇద్దరు కుమార్తెల హత్య.. భర్తతోపాటు ఆ 10 మంది అరెస్ట్   •   బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులన్నీ కాసుల కోసమేనా? అన్నీ మామ, అల్లుడికే తెలుసంటే ఎలా?   •   కాళేశ్వరం దేవస్థానం డైరెక్టర్ గా నియమితులైన కాటం సత్యం   •  

క్షేత్రస్థాయిలో మార్పు కనిపించాలి

16-02-2026 12:32 AM
  1. ప్రజల అంచనాలను అందుకోవాలి
  2. సైబరాబాద్ కమిషనర్‌కు సీఎం దిశానిర్దేశం

హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 15 (విజయక్రాంతి): నూతనంగా ఏర్పాటైన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పనితీరు ప్రజలకు స్పష్టంగా కనిపించాలని, క్షేత్రస్థాయిలో ప్రగతి వెల్లివిరియాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు. సైబరాబాద్ కార్పొరేషన్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన జి సృజన ఆదివారం ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. నగర అభివృద్ధి, కార్పొరేషన్ భవిష్యత్తు కార్యాచరణపై సీఎం ఆమెకు కీలక దిశానిర్దేశం చేశారు.

ముఖ్యమంత్రితో భేటీ అనంతరం కమిషనర్ సృజన వివరాలను వెల్లడించారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా సేవలు అం దించే అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ భేటీలో సీఎం పలు సూచనలు చేశారని తెలిపారు. ‘కొత్తగా ఏర్పడిన కార్పొరేషన్ కావడంతో ప్రజల్లో భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా యంత్రాంగం పనిచేయాలి. కేవలం ప్రణాళికలు మాత్రమే కాదు.. క్షేత్రస్థాయిలో కచ్చితమైన  మార్పు తీసుకురావాలి అని’ సీఎం స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు.