calender_icon.png 16 February, 2026 | 2:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్యాంపు రాజకీయాలకు కేరాఫ్ లియోనియో

16-02-2026 12:25:08 AM

మేడ్చల్, ఫిబ్రవరి 15 (విజయ క్రాంతి): మేడ్చల్ జిల్లా షామీర్పేట్ మండలంలోని లియోనియో రిసార్ట్ క్యాంపు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. మున్సిపల్ చైర్ పర్సనల్ ఎన్నిక నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ కార్పోరేషన్లు మున్సిపాలిటీలకు చెందిన కౌన్సిలర్లతో అధికార పార్టీ లియోనియో లో క్యాంపులు ఏర్పాటు చేసింది. లియోనియో అధికార పార్టీకి నాయ కుడిది అయినందున కౌన్సిలర్లను ఇక్కడికి తరలించారు.

కరీంనగర్ నిజామాబాద్ సిద్దిపేట్ ఇతర ప్రాంతాలకు చెందిన కౌన్సిలర్లు లియోనియోలో ఉన్నారు. టిపిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు తదితరులు లియోనియోకు వచ్చి కౌన్సిలర్లతో సమావేశమయ్యారు. సోమవారం జరిగే చైర్ పర్సన్ ల ఎన్నిక పై చర్చించారు.