6 August, 2026 | 2:26 AM

ఏఐఎస్‌ఏ జిల్లా కన్వీనర్‌గా చరణ్ గౌడ్

06-08-2026 01:47 AM

మొయినాబాద్ ఆగస్టు 5(విజయ క్రాంతి): విద్యార్థి ఉద్యమాలను బలోపేతం చేసి విద్యా రంగ సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు నిర్వహించాలని ఏఐఎస్‌ఏ రాష్ట్ర నిర్మాణ బాధ్యులు, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి మామిండ్ల రమేష్ రాజా పిలుపునిచ్చారు. బుధవారం జరిగిన సమావేశంలో ఏఐఎస్‌ఏ రంగారెడ్డి జిల్లా కన్వీనర్గా చరణ్ గౌడ్, కో-కన్వీనర్లుగా రేశ్వంత్, మణి గౌడ్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణ, ప్రభుత్వ విద్య బలోపేతం కోసం ఉద్యమాలను విస్తరిస్తామని చరణ్ గౌడ్ తెలిపారు.