calender_icon.png 15 July, 2025 | 11:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరీక్షల పేరుతో అధిక ఫీజులు వసూలు

13-11-2024 04:55:30 PM

నారాయణఖేడ్ (విజయక్రాంతి): పదవ తరగతి పరీక్షలకు సంబంధించి పరీక్ష ఫీజులను ప్రవేట్ పాఠశాల యజమాన్యాలు అధికంగా వసూలు చేస్తుందని సిపిఐ నాయకులు ఆనంద్ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. నారాయణఖేడ్ పరిధిలోని పలు ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థుల నుండి అధికంగా ఫీజులు వసూలుకు పాల్పడటం అన్యాయం అన్నారు. పదో తరగతి పరీక్ష ఫీజు ప్రభుత్వపరంగా రూ.125 ఉండగా విద్యార్థుల నుండి 2500 వరకు అధిక ఫీజులు వసూలు చేసిన యజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని ఆయన విద్యాశాఖ అధికారులకు విన్నవించారు. ఈ కార్యక్రమంలో నాయకులు చిరంజీవి, పుప్పల అశోక్ పాల్గొన్నారు.