30 August, 2026 | 10:10 PM

Breaking News

ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేత   •   సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •  

రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులను పరిశీలించిన ఎంపీ గడ్డం వంశీ

13-11-2024 04:45 PM

పెద్దపల్లి (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా రాఘవపూర్ కన్నాల వద్ద మంగళవారం రాత్రి గూడ్స్ రైలు పట్టాలు తప్పిపోవడంతో రైళ్ల రాకపోకలు అంతరాయం కలిగక వెంటనే స్పందించిన రైల్వే అధికారులు పనులను చేపట్టారు. జరుగుతున్న రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ, జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పరిశీలించారు. రైలు ప్రమాద సమాచారం అందుకున్న కలెక్టర్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పోలీసు సిబ్బందితో కలిసి అవసరమైన చర్యలు చేపట్టారు. ఎంపీ వంశీ కృష్ణ సింగరేణి సంస్థతో మాట్లాడి ఘటన స్థలానికి వెంటనే భారీ క్రేన్లు తీసుకుని వచ్చి పట్టాలు తప్పిన గూడ్స్ రైలును క్లియర్ చేసే పనులు ప్రారంభించారు. బుధవారం ఉదయం మళ్లీ ఘటన స్థలానికి వెళ్ళిన కలెక్టర్ అక్కడ జరుగుతున్న రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులను ట్రాక్ ట్రాలి పై వెళ్లి పరిశీలించి, త్వరగా  పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఎంపీ కలెక్టర్ రైల్వే జీఎంను ఆదేశించారు.