ఎంపీ, ఎమ్మెల్యేలపై 42౦ చీటింగ్ కేసు నమోదు చేయాలి
- ఎయిర్ పోర్టు నకిలీ మ్యాప్‌తో ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపణ
- ఏఎస్పీ కి ఫిర్యాదు చేసిన మాజీ మంత్రి రామన్న
ఆదిలాబాద్, ఏప్రిల్ 10 (విజయక్రాంతి) : ఎయిర్ పోర్టు మాస్టర్ ప్లాన్ అంటూ విడుదల చేసిన నకిలీ మాస్టర్ ప్లాన్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్న బీజేపీ ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ లపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏఎస్పీ మౌనికని కలిసి ఎంపీ, ఎమ్మెల్యేలపై ఫిర్యాదు అందజేశారు.
ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ... కేంద్ర విమానయ శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అదిలాబాద్ ఎయిర్పోర్ట్ ఎలాంటి మాస్టర్ ప్లాన్ తయారు కాలేదని మీడియా సమావేశంలో వెల్లడించారని తెలిపారు. కానీ ఇటీవలే ఎంపీ, ఎమ్మెల్యే ఎయిర్ పోర్టు కు సంబంధించిన నకిలీ మాస్టర్ ప్లాన్ ను విడుదల చేసి, మోసపూరిత ప్రకటనలతో ఆదిలా బాద్ ప్రజల్లో భయాందోళనను రేకెత్తిస్తున్నాయి ఆరోపించారు. తక్షణం ఎంపీ ఎమ్మెల్యే పై 420 కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఎస్పీ కి ఫిర్యాదు చేశామన్నారు.
తక్షణం ఎంపీ, ఎమ్మెల్యే లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎలాంటి ప్రభుత్వ గుర్తింపు లేని డూప్లికేట్ మాస్టర్ ప్లాన్ ను పత్రికా ముఖంగా ఇటీవల విడుదల చేయడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. కేంద్ర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈనెల 17న కేంద్ర బృందం తో సర్వే నిర్వహించడం జరుగుతుందని తెలిపారని, మరి ముందే మాస్టర్ ప్లాన్ విడుదల చేసిన ఎమ్మెల్యే మోసపూరిత ప్రకటనలు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు.
తక్షణం ఎంపీ, ఎమ్మె ల్యేలపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు అజయ్, కౌన్సిలర్ లు వెనగంటి ప్రకాష్, ఆత్రం వెంకటేష్, అన్నెలా వసంత్, నాయకులు అశోక్ స్వామి, పందిరి భూమ న్నా, అనిల్, ధమ్మపాల్, కొండ గణేష్, బట్టు సతీష్,సృజన్, దివిటీ రాజు, మహేష్, తదితరులు పాల్గొన్నారు.




