11 April, 2026 | 2:05 AM

కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు?

11-04-2026 12:00 AM

కుబీర్, ఏప్రిల్ 10 (విజయక్రాంతి) : నిర్మల్ జిల్లాలో రైతులు పండించిన మొక్కజొన్న చేతికి వస్తున్న ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకూడదు మొక్కజొన్న రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని నిర్మల్ కుబీర్ సారంగాపూర్ కుంటాల నర్సాపూర్ దిల్వార్పూర్ లక్ష్మణ చందా ముధోల్ లోకేశ్వరం మండలాల్లో సుమారు లక్ష ఇరవై వేల ఎకరాల్లో మొక్కజొన్న పంటను బాగు చేశారు.

ప్రస్తుతం రైతులు హార్వెస్టర్ సాయంత్రం కోతలు కోసి ఆరబెట్టి విక్రయించుకుందామంటే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు లేవని రైతులు తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం మొక్కజొన్నకు క్వింటాలకు 2400 మద్దతు ధర ప్రకటించింది. ప్రైవేట్ లో 1800 నుంచి 2000 వరకు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు అయితే రైతులకు మద్దతు ధర లభించే అవకాశం ఉన్నందున జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.