calender_icon.png 11 November, 2025 | 3:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెదక్ జిల్లా దాతర్‌పల్లిలో పులి?

11-11-2025 12:00:00 AM

రోడ్డు పైనుంచి వెళ్తుండగా ఫొటో తీసిన కారులో ఉన్న వ్యక్తి 

భయాందోళనలో గ్రామస్థులు

తూప్రాన్, నవంబర్ 10: మెదక్ జిల్లా తూప్రాన్ మండలం దాతర్‌పల్లి సమీపంలో పులి కనిపించినట్టు తెలుస్తున్నది. సోమవారం గ్రామ శివారులోని పల్లె ప్రకృతి వనం వద్ద దాతరపల్లి మీదుగా మల్కాపూర్ వెళ్లే మార్గంలో కనిపించిందని ఓ ప్రయాణికుడు చెపుతున్నట్టుగా సమాచారం. సాయంత్రం దాతర్‌పల్లి అడవి సమీపంలో రోడ్డు దాటుతుండగా కారులో వెళ్తున్న వ్యక్తి చూసి ఫొటో తీసి, గ్రామ వాట్సాప్ గ్రూపులో పోస్టు చేసినట్టు తెలుస్తున్నది.

అయితే ఫారెస్టు అధి కారులు ధ్రువీకరించాల్సి ఉంది. గతంలో గుండ్రెడ్డిపల్లి గ్రామ సమీపంలో ఓ కొండపైన పడుకొని ఉన్న పులిని గ్రామస్థులు రెండుసార్లు చూశారు. ఇప్పుడు మళ్లీ కనిపించిందని వార్తలు రావడంతో భయాందోళన చెందుతున్నారు.