23 June, 2026 | 9:32 PM

Breaking News

ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •   విద్యుద్ఘాతంతో పాడిగేదె మృతి   •  

వడ్డెపల్లిలో చిరుత సంచారం

09-10-2024 01:41 AM

భయాందోళనలో రైతులు

దౌల్తాబాద్, అక్టోబర్ 8: సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని వడ్డెపల్లి గ్రామ శివారులో గల దేవుని గుట్ట సమీప పంట పొలాల వద్ద రెండు పిల్లలతో చిరుత సంచరించడం కలకలం రేపింది. స్థానిక రైతులు, వ్యవసాయ కూలీలు మంగళవారం చిరుతతో పాటు రెండు పిల్లలను గమనించారు. ఈ విషయంపై గ్రామస్థులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.

దీంతో అధికారులు హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకొని చిరుత ఆనవాళ్లను పరిశీలించారు. కాగా, కొద్ది నెలల క్రితం గ్రామానికి చెందిన గడ్డం బిక్షపతి అనే రైతు వ్యవసాయ బావి వద్ద కనిపించిన చిరుత పులి తాజాగా రెండు పిల్లలతో కలిసి దేవుని గుట్ట వద్ద కుక్కను వెంటాడుతూ కనిపించిందని స్థానికులు తెలిపారు.

చిరుతను పట్టుకునేందుకు ఆ ప్రాం తంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు అటవీ అధికారులు వెల్లడించారు. రైతులు, కూలీలు ఒంటరిగా పంట పొలాల వద్దకు వెళ్లొద్దని సూచించారు. బావుల వద్ద పశువులను కట్టెయవద్దని తెలిపారు.