7 May, 2026 | 6:43 AM

శంషాబాద్‌లో చిరుత కలకలం!

24-06-2024 12:05 AM

ఘాన్సీమియాగూడలో చిరుత ఆనవాళ్లు

గ్రామంలో లేగదూడ, కుక్కపై దాడి 

రంగారెడ్డి, జూన్ 23 (విజయక్రాంతి) : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని ఘాన్సీమిమా గూడ లో చిరుత సంచరించిన ఆనవాళ్లు కలకలం రేపుతున్నాయి. గ్రామంలోని లేగదూడ, కుక్కపై దాడి చేసిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డవ్వడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో భయాందోళనకు గురైన గ్రామస్థులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆదివారం గ్రామానికి చేరుకొని చిరుత సంచరించిన ఆనవా ళ్లను సేకరించారు. నెల రోజుల క్రితం శంషాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంలో చిరుత సంచరించగా ఫారెస్ట్ అధికారులు ప్రత్యేకంగా బోనులు ఏర్పాటు చేసి దాన్ని బంధించారు. ఈ ఘటన మరువకా ముందే శంషాబాద్ సమీప గ్రామాల్లో మళ్లీ చిరుత సంచరించడం కలకలం రేపుతోంది. అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.