7 May, 2026 | 5:47 AM

సీఎం అంటే కటింగ్ మాస్టరా?

24-06-2024 12:10 AM

అన్ని పథకాల్లోనూ కోతలేనా?

సీఎం రేవంత్‌పై బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ సెటైర్లు

హైదరాబాద్, జూన్ 23 (విజయక్రాంతి): సీఎం అంటే కటింగ్ మాస్టరా? అంటూ రేవంత్ రెడ్డిని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ప్రతి పథకంలోనూ లబ్ధిదారుల సంఖ్యకు కోత పెట్టడమే లక్ష్యమా? సీఎం అనే పదానికి సరికొత్త నిర్వచనమా? అంటూ సోషల్ మీడియా వేదికగా నిలదీశారు. నాడు పరుగు పరుగున వెళ్లి రైతులను లోన్ తెచ్చకోమన్నారు? నేడు రూ.2 లక్షల రుణమాఫీకి సవాలక్ష కొర్రీలు పెడుతున్నారని విమర్శించారు. మొదట రూ.39 వేల కోట్లని చెప్పి ఇప్పుడు రూ.31 వేల కోట్లు కటింగ్ పెట్టారని ఆరోపించారు. పాస్‌బుక్‌లు లేవనే నెపంతో లక్ష మందికి శఠగోపం పెట్టే కుటిల ప్రయత్నాలు చేస్తే సహించబోమని హెచ్చరించారు.

రేషన్ కార్డు సాకుతో లక్షల మందికి మొండి చెయ్యి ఇచ్చే కుతంత్రం చేస్తే వదిలిపెట్టమని అన్నారు. ఆదాయపన్ను చెల్లిస్తున్నారని కొంతమందికి, చిన్నపాటి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారని ఇంకొందరికీ శూన్య హస్తం చూపే చీకటి పన్నాగాన్ని చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. మొన్న లక్షల మందిని రూ.500 సిలిండర్ పథకానికి దూరం చేశారని, నిన్న 200 యూనిట్ల కరెంటు పథకానికి అనేక అంక్షలు పెట్టి ఆగమాగం చేశారని ఆరోపించారు. నాట్ల నాటికి ఇవ్వాల్సిన రైతు బంధు ఇప్పటికీ దిక్కులేదని, ఓట్ల పండగ ముగిసినా ఎకరానికి రూ.7,500 రైతు భరోసాకు అడ్రస్ లేదని అన్నారు. కాంగ్రెస్‌లో పాలనలో అందరికి అన్నీ అన్నారు..