calender_icon.png 28 November, 2025 | 7:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రస్థాయికి దూసుకెళ్లిన సెయింట్ ఆంథోనీస్ విద్యార్థులు

28-11-2025 07:35:59 PM

సంగారెడ్డి,(విజయక్రాంతి): జనవిజ్ఞాన వేదిక తెలంగాణ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా సైన్స్ కేంద్రంలో నిర్వహించిన చెకుముకి సైన్స్ సంబురాలు 2025లో సెయింట్ ఆంథోనీస్ హై స్కూల్, శాంతినగర్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయిలో మొదటి స్థానం సాధించారు. ఈ పోటీలో 10వ తరగతి బి. వేదశ్రీ, 9వ తరగతి పి. వృషాంక్, 8వ తరగతి యన్. శ్రీరాఘవ విజేతలుగా నిలిచి, డిసెంబర్‌లో కరీంనగర్‌లో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీకి అర్హత పొందారు.

ఈ సందర్భంగా సెయింట్ ఆంథోనీస్ విద్యాసంస్థల అధిపతి ఈ. సలోమోన్ రెడ్డి విద్యార్థుల శాస్త్రీయ అభిరుచి, కృషిని అభినందించారు. సంస్థల డైరెక్టర్ ఈ. విజయ్ కుమార్ రెడ్డి, అకాడమిక్ డైరెక్టర్  ప్రిన్సిపల్ ఈ. అరుణా రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ ప్రదీప్ లక్కిశెట్టి విద్యార్థులను అభినందించారు. విద్యార్థులకు శ్రమతో మార్గనిర్దేశం చేసిన ఉపాధ్యాయులు బి.మహేష్ సేవలను పాఠశాల యాజమాన్యం ప్రత్యేకంగా ప్రశంసించింది. రాష్ట్రస్థాయి పోటీల్లో కూడా విజయాలు సాధించాలని యాజమాన్యం ఆశాభావం వ్యక్తం చేసింది.