పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎస్ఐ యుగంధర్ గౌడ్
28-11-2025 07:39 PM
వలిగొండ,(విజయక్రాంతి): తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా వలిగొండ మండలంలో ఈనెల 30 నుండి రెండవ విడత ప్రారంభం కానుంది. అందులో భాగంగా శుక్రవారం వలిగొండ ఎస్సై యుగంధర్ గౌడ్ మండలంలోని అరూర్, వేములకొండ, చిత్తాపురం గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సిబ్బందికి తెలియజేయడం జరిగింది.




