28-11-2025 07:45:06 PM
నకిరేకల్,(విజయక్రాంతి): ఈనెల 30న తిప్పర్తి లో జరిగే టీఎస్ యుటిఎఫ్ నల్గొండ జిల్లా విస్తృత కమిటీ సమావేశాలను విజయవంతం చేయాలని కేతపల్లి మండల శాఖ అధ్యక్షులు కాశిమల్ల నాగయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్‌లో పోస్టర్ ఆవిష్కరిస్తూ ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పాఠశాలల బలోపేతం, ఇంగ్లీష్ మీడియం ప్రవేశం, ఎన్రోల్మెంట్ డ్రైవ్‌లు వంటి కార్యక్రమాల్లో టీఎస్ యుటిఎఫ్ ముందుండి పనిచేస్తోందని పేర్కొన్నారు.
ఉపాధ్యాయుల హక్కులు, బాధ్యతలు, ప్రభుత్వ విద్యా రంగ అభివృద్ధి కోసం సంఘం రాజీలేని పోరాటాలు చేస్తోందని తెలిపారు. ఆదివారం జరిగే జిల్లా విస్తృత కమిటీ సమావేశాలకు ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో జయసాగర్, శ్యామయ్య, గోపయ్య, వీరభద్రయ్య, రమేష్, శంకరయ్య, నర్సిరెడ్డి, యాదగిరి, శ్రీలత, యాదమ్మ, అశ్విని తదితరులు పాల్గొన్నారు.