calender_icon.png 28 November, 2025 | 8:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోగిని కాపాడిన మెడికోవర్ వైద్యులు

28-11-2025 07:51:01 PM

హనుమకొండ,(విజయక్రాంతి): మెడికవర్ హాస్పిటల్స్, వరంగల్ వైద్య బృందం అత్యాధునిక పద్ధతిలో అంజియోప్లాస్టీ చేసి  నెల్లుట్ల రామ్ మోహన్ రావు అనే వ్యక్తిని  ప్రాణాన్ని కాపాడారు. హనుమకొండ మెడికవర్ హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డా. సంతోష్ మొడానీ మోహన్‌లాల్ మాట్లాడుతూ ఈ విధమైన ప్రొసీజర్‌ను ఈ ప్రాంతంలో మొదటిసారిగా విజయవంతంగా నిర్వహించడం విశేషమని, 2005లో బైపాస్ శస్త్రచికిత్స, 2015లో స్టెంట్ పొందిన ఈ రోగి ఇటీవల తీవ్రమైన హార్ట్ అటాక్‌ తో ఆసుపత్రికి చేరుకున్నాడని, పరీక్షల్లో ఆయన హార్ట్ ఆర్టరీలు అధికంగా కాల్షియంతో గట్టిపడి ఉండటం గుర్తించి, ఇది తెలంగాణలో వృద్ధ వయస్సు గల హృదయ రోగుల్లో సాధారణంగా కనిపించే, అత్యంత క్లిష్ట పరిస్థితి గా గమనించాలన్నారు.

అత్యంత గట్టిపడ్డ, కాల్షియం పేరుకుపోయిన ఆర్టరీల్లో సాధారణ బెలూన్లు లేదా స్టెంట్లు సరిగా పనిచేయవు; రక్తనాళం దెబ్బతినే ప్రమాదం, మళ్లీ మళ్లీ హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశాలు, హఠాత్తుగా కర్డియాక్ సమస్యలు ఏర్పడే అవకాశం ఎక్కువ అని భావించి, తెలంగాణలో 70 ఏళ్లు పైబడిన హార్ట్ పేషెంట్లలో దాదాపు 30–35% మందికి మధ్యస్థం నుండి తీవ్రమైన కాల్షియం డిపాజిట్స్ ఉంటాయి, వీరిలో పురుషుల శాతం సుమారు 60% ఉంటుందన్నారు.

డయాబెటిస్, హైపర్‌టెన్షన్ ఎక్కువగా ఉన్న వరంగల్ సమీప జిల్లాల్లో ఇటువంటి క్లిష్ట బ్లాకేజీలు ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయని, రోగి వయస్సు, బ్లాకేజీ తీవ్రత దృష్ట్యా, మళ్లీ బైపాస్ చేయడం సాధ్యం కాకపోవడంతో మెడికవర్ కార్డియాక్ బృందం ఇన్‌ట్రావాస్క్యులర్ అల్ట్రాసౌండ్‌ తో సహాయపడే ఆధునిక వాస్క్యులర్ మోడిఫైయింగ్ టెక్నిక్‌ను ఉపయోగించింది. ఐవియుఎస్ వలన ఆర్టరీ లోపల పరిస్థితిని ప్రత్యక్షంగా, స్పష్టంగా చూడటం సాధ్యమవుతుంది. ఈ ఆధునిక విధానం కాల్షియంలా రాళ్లలా గట్టిపడ్డ ప్రాంతాలను మృదువుగా మార్చి, స్టెంట్ పూర్తిగా విస్తరించేందుకు, రక్తప్రవాహం సురక్షితంగా పునరుద్ధరించేందుకు సహాయపడిందన్నారు.

డా. సంతోష్ మొడాని, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ మాట్లాడుతూ... “ఇప్పటికే బైపాస్, స్టెంట్ చేసిన ఆర్టరీలో ఇంత భారీ కాల్షియం ఉండటం చికిత్సను మరింత క్లిష్టం చేస్తుంది. అయితే ఐవియుఎస్ మరియు తాజా పరికరాలు అయిన ఐవి ఎల్,రోటేషనల్ అబ్లేషన్, ఆర్బిటల్ అథిరెక్టమీ, లేజర్ వంటి వాటితో ఇప్పుడు ఇలాంటి కఠినమైన బ్లాకేజీలను సురక్షితంగా చికిత్స చేసి, ఎప్పటికి మించి దీర్ఘకాల ప్రయోజనాలు ఇవ్వగలం. ఇంతకుముందు చికిత్సకు వీలులేని రోగులకు ఇవి ఒక వరంలాంటివి” అని పేర్కొన్నారు.

ఈ విజయవంతమైన ప్రొసీజర్‌ ద్వారా వరంగల్ మెడికవర్ హాస్పిటల్స్ అత్యంత ప్రమాదకరమైన హృదయ రోగాలను కూడా ప్రపంచ స్థాయి సాంకేతికతతో చికిత్స చేయగల సామర్థ్యాన్ని మరోసారి నిరూపించింది. దీంతో వరంగల్, హన్మకొండ, జనగామ మరియు పరిసర ప్రాంతాల ప్రజలు ఇక మెట్రో నగరాలకు వెళ్లకుండానే ఆధునిక, ప్రాణరక్షక హృదయ చికిత్సలను స్థానికంగానే పొందగలుగుతున్నారు. ఈ కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్స్ వరంగల్ సెంటర్ హెడ్ నమ్రత, ఏజీఎం హరినాథ్  పాల్గొన్నారు.