calender_icon.png 28 November, 2025 | 7:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాళేశ్వరంతో కామారెడ్డికి చుక్క నీరు రాలే

28-11-2025 07:26:00 PM

గత బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల వైఖరి ఒకటే

21, 22 ప్యాకేజీ పనులు ముందుకు సాగించేది ఎప్పుడు

కేవలం కాంట్రాక్టర్లకు డబ్బులు, రైతులకు చుక్కనీరు లేదు

కాలేశ్వరం కాకుంటే ప్రత్యామ్నాయంగా సాగునీరు తేస్తారా లేదా..?

తెలంగాణ జాగృతి పోరాటం తప్పదు

తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

కామారెడ్డి,(విజయక్రాంతి): కాలేశ్వరం ప్రాజెక్ట్ తో కామారెడ్డికి ఒక ఎకరానికి కూడా నీళ్లు రాలేదని తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. జనం బాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కామారెడ్డి నియోజకవర్గంలో పర్యటించారు. కామారెడ్డిలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్యాకేజీ 21, 22 ద్వారా నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలకు కాలేశ్వరం నీరు తెస్తామని గతంలో కాంగ్రెస్, బిఆర్ఎస్ ప్రభుత్వాలు నిధులు కేటీ కేటాయించినవి కేవలం కాంట్రాక్టర్లకే డబ్బులు సరిపోయాయని రైతులకు మాత్రం చుక్క నీరు రాలేదన్నారు.

కాలేశ్వరం పనులను కొనసాగిస్తారా లేక ప్రత్యామ్నాయంగా కామారెడ్డి, జిల్లా రైతులకు సాగునీరు తీస్తారా అని ప్రశ్నించారు. తెలంగాణ జాగృతి తెలంగాణ పోరాటంలో పాల్గొనడమే కాకుండా సమస్యల పట్ల పోరాటం చేయడమే ధ్యేయంగా జిల్లాల్లో పర్యటన చేపట్టినట్లు తెలిపారు. ఇప్పటికి పది జిల్లాల్లో పర్యటించి సమస్యలను తెలుసుకోవడం జరిగిందన్నారు. ప్రభుత్వాల దృష్టికి తెచ్చి ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తామన్నారు. మరో 17 జిల్లాల్లో పర్యటించాల్సి ఉందని తెలిపారు. రాబోయే రోజుల్లో మరికొన్ని రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జనం బాట నిర్వహించి సమస్యలపై పోరాటం చేస్తామన్నారు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించే వరకు పోరాటం తప్పదన్నారు. కాంగ్రెస్ బిజెపి టిఆర్ఎస్ లో ప్రజల సమస్యలను విస్మరిస్తున్నాయన్నారు. ప్రత్యామ్నాయం కోసం ప్రజల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పోరాటం చేస్తున్నమన్నారు. 19 సంవత్సరాల నుంచి తెలంగాణ జాగృతి తెలంగాణ ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పరితపించిన సమస్త తెలంగాణ జాగృతి అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎక్కని బండలేదు ఎక్కని కొండ లేదు అని అన్నారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని పోరాటం చేస్తున్నమన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పారు ప్రాంతం అస్తిత్వం పోతే తిరిగి సాధించుకోవాలంటే చాలా సంవత్సరాల కాలం పడుతుందని చెప్పారన్నారు. తెలంగాణ ప్రజల మేలుకు చేయడం కోసమే తెలంగాణ జాగృతి జనం బాట పట్టింది అన్నారు ఇప్పటికి 11 జిల్లాల్లో పర్యటించడం జరిగింది అన్నారు.

వారి సమస్యలను తెలుసుకోవడం ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరుగుతుందన్నారు. ఇంకా 21 జిల్లాల లో పర్యటిస్తామన్నారు. ఎన్నికల కోడ్ ఉన్నందున హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జనంబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. కామారెడ్డి లో భారీరి వర్షం పడి అతలా కుతులం ఐ తీవ్రంగా నష్టపోయిన ప్రజలను చూసేందుకు వచ్చిన ముఖ్యమంత్రి హామీ ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చ లేదన్నారు. ఎల్లారెడ్డి లింగంపేట రహదారిలో బ్రిడ్జి కూలిపోయి రెండు నెలల పాటు రాకపోకలకు అంతరాయం కలిగిన ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. స్థానిక ఎమ్మెల్యే సైతం పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు.

ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేదా అనే అనుమానం వస్తుందన్నారు. ప్రజల కోసం ఎన్నుకున్న నాయకులు ప్రజల సమస్యలను గాలికి వదిలేస్తున్నారన్నారు. కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ నియోజకవర్గంలో పర్యటిస్తే రోడ్ల పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉందన్నారు. గత శాసనసభ ఎన్నికల ముందు కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ చేసిందన్నారు. కానీ అమలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తుందన్నారు. బీసీలకు 42  శాతం రిజర్వేషన్ సాధించేవరకు తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుందన్నారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

 కామారెడ్డిలో రైలు రోకో

కవిత అరెస్ట్, స్వల్ప గాయాలు

42 శాతం రిజర్వేషన్లు బీసీలకు కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కవిత శుక్రవారం కామారెడ్డిలో జాగృతి కార్యకర్తలతో కలిసి రైలు రోబో నిర్వహించారు.  బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. అరగంట పాటు ఆందోళన నిర్వహించారు. దీంతో పోలీసులు ఆందోళనలను అడ్డుకున్నారు. దీంతో కవిత సస్యమేరా అనడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. 

పోలీసులు చేరుకొని రైలు రోకో చేస్తున్న తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కవితతో పాటు తెలంగాణ జాగృతి కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులతో వాగ్వాదంలో కవితకు చేతికి స్వల్ప గాయాలు అయ్యాయి. పోలీసుల తీరును నిరసించారు. కవితను పోలీస్ స్టేషన్ కు తరలించారు. జనం బాట షెడ్యూల్ ప్రకారం విలేకరుల సమావేశం నిర్వహించిన అనంతరం మేధావులతో సమావేశం నిర్వహించాల్సి ఉండగా రైలు రోకో కార్యక్రమాన్ని నిర్వహించడంతో పోలీసులు అడ్డుకున్నారు. జిఆర్ కాలనీలో జిఆర్ కాలనీ వాసులను పరమార్సించాల్సి ఉండగా పోలీసులు అరెస్టు చేయడంతో జిఆర్ కాలనీ పాసులను పరామర్శించే కార్యక్రమం వాయిదా పడింది.

దేవునిపల్లిలో గొర్రెల కాపరి గొర్రెలు మేపడానికి వెళ్లి రైలు ప్రమాదంలో చిక్కుకొని 90 గొర్రెల మృతి చెందగా గొర్రెల కాపరి సుధాకర్ మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న కవిత వారి కుటుంబం మద్దకు వెళ్లి పరామర్శించి వారికి 50 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. స్థానిక ఎమ్మెల్యేలు పట్టించుకోలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షులు సంపత్ గౌడ్, మహిళా అధ్యక్షురాలు, స్రవంతి, బాజ లలిత,యూత్ ప్రతినిధులు రాము, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.