calender_icon.png 8 January, 2026 | 7:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెజ్జూరు నుండి చేప్రాలకు మహాపాదయాత్ర

07-01-2026 03:10:57 PM

బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండల కేంద్రం నుండి చెప్రాల మహా పాద యాత్ర ఈనెల  జనవరి 17 శనివారం 18 ఆదివారాలలో నిర్వహించబడునని కమిటీ సభ్యులు తెలిపారు. శనివారం బెజ్జూర్ నుండి మహారాష్ట్రలోని చప్రాలకు పాదయాత్ర గా బయలుదేరి శనివారం సాయంత్రం చేరుకుంటారు. ఆదివారం తెల్లవారుజామున గంగ నీటితో అభిషేకం,మహా పాదపూజ,పల్లకి శోభాయాత్ర, ప్రత్యేక పూజా కార్యక్రమం హారతి, అనంతరం అన్న ప్రసాదం కార్యక్రమం భక్తులకు ఏర్పాటు చేస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. కావున భక్తులు పెద్ద ఎత్తున హాజరై ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు.