calender_icon.png 9 January, 2026 | 2:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీపీసీసీ లీగల్ సెల్ రాష్ట్ర కో కన్వీనర్ గా చేపూరి మధుసూదన్

07-01-2026 09:23:49 PM

చిట్యాల,(విజయ క్రాంతి): తెలంగాణ పిసిసి  లీగల్ సెల్ పౌర హక్కులు మరియు ఆర్టిఐ రాష్ట్ర  కో కన్వీనర్ గా చిట్యాల కు చెందిన ప్రముఖ న్యాయవాది శేపూరి మధుసూదన్ ను నియమిస్తూ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్  బుధవారం జారీ చేసిన నియామక పత్రాన్ని నల్గొండ జిల్లా కోర్టు ప్రభుత్వ ప్లీడర్ నాంపల్లి నరసింహ నియామక పత్రాలను ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా చేపూరి మధుసూదన్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ పదవి ఇచ్చినందుకు గాను కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తన నియామకానికి సహకరించిన పొన్నం అశోక్ గౌడ్ కు, ఇతర నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.