18 June, 2026 | 1:56 AM

విద్యుత్ ప్రమాద బాధితులకు చెక్కులు అందజేత

18-06-2026 12:00 AM

నారాయణఖేడ్, జూన్ 17: నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలో విద్యుత్ ఘాతానికి గురైన బాధితులకు ప్రభుత్వం నుండి మంజూరైన నష్టపరిహార చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి బుధవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో చెక్కులను అందజేశారు. 2018 నుండి విద్యుత్ ఘాతానికి గురైన రైతులు, విద్యుత్ ఘాతంతో మృతి చెందిన పశువులకు సంబంధించి నియోజకవర్గానికి రూ.45,88,000 మంజూరు అవడం జరిగిందన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం విద్యుత్ ఘాతంతో మరణించిన వారి కుటుంబాలను ఆదుకోవడంలో విపలమైందని ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక  నష్టపోయిన రైతులకు అండగా ఉండేందుకు ప్రత్యేక చొరవతో బాధితులకు నష్టపరిహారం అందించడం జరిగిందన్నారు.

విద్యుత్ ఘాతంతో మృతి చెందిన నలుగురు బాధితులకు రూ.20 లక్షలు మంజూరు కాగా 64 మంది రైతులకు సంబంధించి పశువులు మృతి చెందగా వారికి రూ.25.60లక్షలు, మేకలకు సంబంధించి 47 వేల రూపాయలు మంజూరవగా వాటిని బాధితులకు అందజేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో స్థానిక విద్యుత్ శాఖ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.