13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

సమ్మె బాటలో చికెన్ వ్యాపారులు

27-03-2026 02:22 AM

ఏప్రిల్ 1 నుంచి కోడి మాంసం విక్రయాలు నిలిపివేత 

ఎల్బీనగర్, మార్చి 26 : కమిషన్ పెంచాలని చికెన్ షాప్ నిర్వాహకులు డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 1వ తేదీ నుంచి సమ్మె చేస్తున్నారు. డిమాండ్ల సాధనలో భాగంగా  ఏప్రిల్ 1వ తేదీ నుంచి చికెన్ మాంసం విక్రయాలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఇందు లో భాగంగా గురువారం చంపాపేటలోని చికెన్ షాప్ యజమానులు నిరసన తెలిపారు. ఎల్బీనగర్ చికెన్ షాప్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చంపాపేట, కర్మన్ ఘాట్ డివిజన్లలో యజమానులు ఆందోళన చేపట్టా రు.

మార్జిన్ పెంచాలని తెలంగాణ రాష్ట్ర చికెన్ ఓనర్స్ అసోసియేషన్ బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పలువురు చికెన్ షాప్ నిర్వాహకులు మాట్లాడుతూ... మార్జిన్ ఇన్వెస్ట్మెంట్ పౌల్ట్రీ కంపెనీ విధానాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కమిషన్ లేకపోవడంతో లాభాలు లేక వ్యాపారం సాగించడం కష్టమైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇం దులో భాగంగా ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపులు మూసివేస్తున్నట్లు వ్యాపారులు ప్రకటించారు. ప్రజలు తమ సమస్యను అర్థం చేసుకుని సహకరించాలని వ్యాపారులు కోరుతున్నారు.