27 March, 2026 | 4:07 AM

ఆటో డ్రైవర్లకు ఉచిత కంటిపరీక్షలు

27-03-2026 02:21 AM

మహబూబాబాద్, మార్చి 26 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా క్టర్ శబరీష్ ఆదేశాల మేరకు గురువారం జి ల్లాలోని తొర్రూరు, కురవి పోలీసులు ఆటో డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా దృష్టి లోపం ఉన్న 23 మంది ఆటో డ్రైవర్లకు ఉచితంగా కంటిఅద్దాలు అందజేశారు. రోడ్డు భద్రతను దృ ష్టిలో ఉంచుకుని అరైవ్ అలైవ్ కార్యక్రమా న్ని నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు.