15-11-2025 12:01:40 AM
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
చిట్యాల,(విజయక్రాంతి): ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు ఒక వరమని, లబ్ధిదారులకు చెక్కును అందజేస్తూ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శుక్రవారం తెలిపారు. చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామానికి చెందిన పాలకూరి ఇందిర భర్త చంద్రయ్య ఇటీవల అనారోగ్యంతో హాస్పిటల్ లో చికిత్స పొందగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు 10,500లను ఆయన లబ్ధిదారులకు అందజేశారు.