08-11-2025 08:49:57 PM
అశ్వాపురం,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదినాన్ని శనివారం అశ్వాపురం మండల కాంగ్రెస్ పార్టీ ఘనంగా నిర్వహించింది. స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఓరుగంటి బిక్షమయ్య ఆధ్వర్యంలో మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిక్షమయ్య మాట్లాడుతూ, గ్రామీణ స్థాయి నుంచి ఒక్కో మెట్టు ఎదుగుతూ ముఖ్యమంత్రి స్థాయికి చేరిన రేవంత్ రెడ్డి గారు సామాన్య ప్రజల కష్టసుఖాలను బాగా అర్థం చేసుకున్న నాయకుడు.
అందుకే రాష్ట్రంలోని అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నారు అని తెలిపారు. అలాగే నిత్యం ప్రజల కోసం శ్రమించే రేవంత్ రెడ్డి గారు నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని, వచ్చే 15 సంవత్సరాలు అధికారంలో కొనసాగి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. అంతకుముందు సాయిబాబా దేవాలయంలో బిక్షమయ్య నేతృత్వంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ముఖ్యమంత్రికి దీర్ఘాయుష్షు కోరుతూ ప్రార్థనలు చేశారు.