calender_icon.png 8 November, 2025 | 10:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్న పైడి ఎల్లారెడ్డి

08-11-2025 08:47:53 PM

కామారెడ్డి (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రహమత్ నగర్ డివిజన్ కేంద్రంలో శనివారం ప్రచారంలో డా. పైడి ఎల్లారెడ్డి ఓటర్లతో మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలనను గాలికి వదిలేసి కుమ్ములాడుకుంటున్నారని అన్నారు. ఈ ఉప ఎన్నికల్లో బిజెపి గెలిస్తే రాష్ట్ర ప్రభుత్వం తన వైఫల్యాలని చేతగాని తనాన్ని ఒప్పుకొని ప్రభుత్వం తన తప్పులని సరిదిద్దుకొని పరిపాలన పైన దృష్టి పెడుతుందని అన్నారు.

గత సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలుకు నోచుకోలేదని అన్నారు. ఈ ప్రభుత్వానికి జూబ్లీహిల్స్ బిజెపి గెలుపు చెంపపెట్టు లాంటిదిగా కావాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి గాని బారాసాకు ఓటు వేస్తే ఎంఐఎంకు ఓటేసినట్టేనని ఆన్నారు. గడపగడపకు.. తిరిగి ఓటర్లను కలిసి బిజెపిని గెలిపించాలని కోరారు. ఆయనతో పాటు స్థానిక బిజెపి నాయకులు రాష్ట్ర బిజెపి నాయకులు మాజీ కార్పొరేటర్లు ఎల్లారెడ్డి ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.