calender_icon.png 8 November, 2025 | 10:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అబ్దుల్ నాగారంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

08-11-2025 08:53:05 PM

అబ్దుల్ నాగారం: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు శనివారం గ్రామ శాఖ అధ్యక్షుడు కావటి సుధాకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చిత్రపటం ఎదురుగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం స్వీట్లు పంచి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. సీనియర్ నాయకులు మూల రాములు, భాష బోయిన రమేష్, కాసాని గాలయ్య, నీల కనకరాజు, భాషబోయిన సురేష్, ఏదునూరి సుధాకర్, బాలగోని శీను, పండుగ సాయిలు తదితరులు పాల్గొన్నారు.