03-12-2025 08:01:50 PM
కోదాడ: మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి ప్రాణత్యాగంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిందని ఉమ్మడి నల్గొండ జిల్లా మలిదశ ఉద్యమకారుల అధ్యక్షులు సంక్షేమ సంఘం అధ్యక్షులు రాయపూడి వెంకటనారాయణ అన్నారు. శ్రీకాంత్ ఆచారి వర్ధంతిని పురస్కరించుకొని విష్ణు రామ్ థియేటర్ దగ్గర గల శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. సూర్యాపేట జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో శ్రీకాంతాచారి విగ్రహానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నాగేంద్ర చారి జిల్లా ప్రధాన కార్యదర్శి జిలేపల్లి శ్రీధర్ చారి దేశోజ ఉపేంద్ర చారి గోధుమల హనుమా చారి నా మోజు వెంకటాచారి ఉద్ధోజు నాగకృష్ణమాచారి శివాచారి పాల్గొన్నారు.