11 August, 2026 | 12:37 PM

Breaking News

అధ్వాన్నంగా మారిన ప్రధాన రహదారి పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు   •   పశుపోషణతో రైతులకు అదనపు ఆదాయం   •   పాఠశాలకు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం డ్రమ్స్ అందజేత   •   మానేరు వాగుపై మట్టి రోడ్డుకు గండి.. కాంట్రాక్టర్ అత్యుత్సాహం..!   •   ఘజియాబాద్ లో కూలిన మూడంతస్తుల భవనం   •   పోలీస్ స్టేషన్ పైకప్పు పెచ్చులూడిపడి ఏఎస్ఐకి గాయాలు   •   సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి   •   తమిళనాడు అసెంబ్లీలో నీట్ విధానాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం   •   కొలంబియాలో భారీ భూకంపం   •   శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా వెండి కాయిన్స్ స్వాధీనం   •  

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభను జయప్రదం చేయండి

02-09-2025 06:32 PM

రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 3వ తేదీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండలో పర్యటించనున్నారని, జరిగే బహిరంగ సభకు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలనీ రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్, పాల్వంచ సొసైటీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు(Palvancha Society Chairman Kotwala Srinivasa Rao) కోరారు. మంగళవారం పాల్వంచ పట్టణం పరిధి అయ్యప్పనగర్ లోని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ, చండ్రుగొండ మండలం బెండలపాడు గ్రామంలో ఇందిరమ్మ గృహాల గృహప్రవేశాలను ముఖ్యమంత్రి చేస్తారని, అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు లక్ష మందితో భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారన్నారు.

జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి, రేణుక చౌదరి లతో పాటు పలువురు మంత్రులు, శాసనసభ్యులు పాల్గొంటారన్నారు . ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ముఖ్యమంత్రి పర్యటనను జయప్రదం చేయాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ZPTC సభ్యులు బరపటి వాసుదేవరావు, యర్రంశెట్టి ముత్తయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జాలే జానకిరెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు  కోండం వెంకన్న, పెద్దమ్మగుడి చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు,  ఐఎన్టియుసి జిల్లా అధ్యక్షులు SA జలీల్, ఆర్టిఏ  మెంబెర్ బాదార్ల జోషి కుమార్, ఎల్ డి యం కోఆర్డినేటర్ బద్ది కిషోర్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పైడిపల్లి మహేష్, కాంగ్రెస్ నాయకులు మహీపతి రామలింగం, కాల్వ భాస్కరరావు,  తదితరులు పాల్గొన్నారు.