11 August, 2026 | 2:07 PM

వైద్య క్యాంపులు నిర్వహించి ప్రజా ఆరోగ్యం కాపాడాలి

02-09-2025 06:29 PM

సిపిఎం సీనియర్ నాయకుడు, సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు రణపంగ కృష్ణ

పెన్ పహాడ్: మండలంలో ఏ గ్రామానికి వెళ్లినా పారిశుధ్యం లోపించి గ్రామాలు కంపు కొడుతున్నాయని.. దీంతో గ్రామాలు జబ్బులు పడుతున్నాయని వెంటనే వైద్యారోగ్య శాఖ స్పందించి వైద్య క్యాంపులు నిర్వహించి ప్రజా ఆరోగ్యం కాపాడాలని సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు రణపంగ కృష్ణ(CITU District Committee Member Ranapanga Krishna) అన్నారు. మంగళవారం మండలంలోని లింగాల గ్రామంలో ప్రజా సమస్యలపై సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక అధికారి పాలనలో గ్రామాలు చెత్త కుప్పలుగా మారాయని అధికారులు ఏమాత్రం స్పందించకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురై మలేరియా, డెంగు జ్వరాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలన్నారు.

అలాగే లింగాల టు అన్నారం  తారు రోడ్డుకు నిధులు కేటాయించినట్లు గత ప్రభుత్వ హయాంలో పాలాభిషేకం చేసి హడాహుడి చేసి నేటికీ ఈ రోడ్ విస్తరణ పనులు పూర్తి కాకపోవడం బాధ కరమన్నారు. ప్రత్యేక అధికారుల పాలనలో ప్రజా సమస్యలు రోజురోజుకు పేరుకు పోతున్నాయని, వెంటనే డ్రైనేజీ  రోడ్లవెంటనే సిసి రోడ్లు మరమతు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో  సిపిఎం శాఖ కార్యదర్శి రణపంగ బుచ్చి  రాములు, మాజీ ఉపసర్పంచ్ మామిడి బిక్షం గౌడ్.  మాజీ వార్డు నెంబర్ రణపంగ పుల్లయ్య, లోడంగి మధు రణపంగ అనిల్ తదితరులు ఉన్నారు.