9 April, 2026 | 2:51 AM

ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం

09-04-2026 12:59 AM

మఠంపల్లి, ఏప్రిల్ 8 :  ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం అని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భూక్యా మంజీ నాయక్ అన్నారు. మండలములోని చెన్నాయి పాలెం గ్రామానికి చెందిన బానోతు రాగ్యా నాయక్ ఇటీవలే అనారోగ్యంతో చికిత్స చేయించుకొని సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకోగా వారికి నాలభై ఎనమిది వేల రూపాయలు మంజూరు కావడంతో చెక్కును లబ్ధిదారుడికి బుధవారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూక్యా మంజీ నాయక్ చెక్కు అందజేశారు.

లబ్ధిదారులు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి,చెక్కులు మంజూరుకు కృషి చేసిన మండల అధ్యక్షుడుకి,చెన్నాయిపాలెం సర్పంచ్ భూక్యా రవీందర్ నాయక్ కు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మైనార్టీ సెల్ నియోజకవర్గం అధ్యక్షుడు కరీం, భూక్యా రమణ,మలోతు రవీందర్ నాయక్,మలోతు గాంధీ నాయక్, బాణోతు హరిశ్వర్ నాయక్, మాలోతు నాధం తదితరులు పాల్గొన్నారు.