15-08-2025 12:41:32 PM
మహబూబాబాద్, విజయక్రాంతి: పంద్రాగస్టు వేడుకల సందర్భంగా ఓ చిన్నారి విద్యార్థి పోలీసు యూనిఫామ్ వేసుకొని మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు పోలీస్ స్టేషన్లో నిర్వహించిన వేడుకలకు హాజరయ్యాడు. పోలీస్ యూనిఫామ్ లో ఉన్న చిన్నారిని చూసి ముచ్చటపడ్డ ఎస్ ఐ చిర్ర రమేష్ బాబు అతనికి నోట్ బుక్ పెన్ను బహుమతిగా అందించి నీ ఆకాంక్ష నిజం కావాలని.. నాలాగా నువ్వు భవిష్యత్తులో ఎస్ ఐ ఉద్యోగం సాధించాలని ఆశీర్వదించాడు.