calender_icon.png 24 May, 2025 | 12:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇటుక బట్టీల్లో బాలకార్మికులు

24-05-2025 12:00:00 AM

  1. యజమానుల వేధింపులు 
  2. అధికారుల తనిఖీలో వెలుగు చూసిన ఘోరం 
  3. ఒడిశా ఎన్జీవో ఫిర్యాదుతో కదిలిన యంత్రాంగం 

మేడ్చల్, మే 23(విజయ క్రాంతి): మేడ్చల్, షామీర్పేట మండలాల్లో ఇటుక బట్టీల యజమానుల ఆగడాలకు అంతులేకుండా పోయింది. ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులను బంధించి పనులు చేయించుకుంటు న్నారు. బాల కార్మికులను సైతం బంధించి పనులు చేయించుకుంటున్నట్టు అధికారుల తనిఖీలో బయటపడింది. స్థానికులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించు కోలేదు.

ఒడిశా నుంచి ఒక స్వచ్ఛంద సంస్థ చేసిన ఫిర్యాదుతో అధికారులు తప్పనిసరి పరిస్థితుల్లో ఇటుక బట్టీల వైపు వెళ్లాల్సి వచ్చింది. జగ్గం గూడా గ్రామంలో తోకల మాధవరెడ్డి ఇటుక బట్టీలో పనిచేయడానికి ఒడిస్సా కు చెందిన  28 కుటుంబాలతో ఒ ప్పందం చేసుకున్నాడు. ఇటుక బట్టీల వద్ద వీరికి ఎలాంటి వసతులు కల్పించలేదు.

రేకు ల షెడ్లు వేసి అందులో ఉంచాడు. వేతనాలు కూడా సరిగా ఇవ్వడం లేదు. మాధవరెడ్డి వేధింపులు భరించలేక ఒక కార్మికుడు ఒడి స్సా వెళ్లి స్వచ్ఛంద సంస్థను ఆశ్రయించాడు. స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, అక్కడి కార్మిక శాఖ అధికారులు, చైల్ ప్రొటెక్షన్ అధికారు లు మేడ్చల్ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.

కలెక్టర్ ఆదేశాల మేరకు స్థానిక తహసిల్దార్, అసి స్టెంట్ లేబర్ ఆఫీసర్ సాయికుమార్, చైల్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఇంతియాజ్, షామీర్పేట తహసిల్దార్ యాదగిరి రెడ్డి, సీఐ శ్రీనాథ్ తదితరులు ఇటుక బట్టీల వద్దకు వెళ్లి విచారణ జరిపారు. 28 కుటుంబాలకు చెందిన 92 మంది కార్మికులు పనిచేస్తున్నారని, అందు లో ఏడుగురు బాల కార్మికులు, ఇద్దరూ బాండెడ్ కార్మికులు ఉన్నట్లు గుర్తించారు. అన్ని ఇటుక బట్టీలలో ఇలాంటి పరిస్థితే ఉంది.

ఇటుక బట్టీలలో అన్నీ ఉల్లంఘనలే! 

ఇటుక బట్టీల ఏర్పాటులో యజమాను లు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. మేడ్చల్ మండలంలో ఒక్క బట్టీకి కూడా అనుమతి లేదు. రెవెన్యూ అధికారులు 11 ఇటుక బట్టీ లు గుర్తించగా అందులో ఐదు ఇటుక బట్టీ లు అసైన్మెంట్ భూములలోనే ఉన్నాయి. ఇ వే కాకుండా ఇంకా ఎన్ని ఉన్నాయో లెక్క తీ స్తున్నారు.

నిబంధన ప్రకారం ఇటుక బట్టి ఏ ర్పాటు చేయాలంటే ముందుగా నాల కన్వర్షన్ చేయాలి. మట్టి తీయడానికి మైన్స్ అ నుమతి ఉండాలి. కాలుష్య నియంత్రణ మం డలి అనుమతి కూడా అవసరమే. బట్టీలలో 50 నుంచి 200 మంది కార్మికులు పనిచేస్తే కార్మిక శాఖ ఉప కమిషనర్ నుంచి, 20 నుంచి 50 మంది కార్మికులు పనిచేస్తే స్థానిక కార్మిక శాఖ అధికారుల నుంచి అనుమతి తీ సుకోవాలి.

కానీ ఇవేమీ తీసుకోవడం లేదు. ఇటుక బట్టీలకు అధికారిక కనెక్షన్లు లేవు. అన్ని దొంగ కనెక్షన్లు ఉన్నాయి. అధికారిక కనెక్షన్ ఇవ్వాలంటే బట్టీలకు అన్ని అనుమతులుండాలి. అన్ని అనుమతులు లేనందున దొంగ కనెక్షన్ వాడుతున్నారు.

సిండికేట్‌గా మారిన ఇటుక బట్టీల యజమానులు 

మేడ్చల్, షామీర్పేట్ మండలాల్లో ఇటుక బట్టి యజమానులు సిండికేట్ గా మారారు. నిబంధనల ప్రకారం అన్ని శాఖల నుంచి అనుమతి తీసుకునే బదులు అమ్యామ్యాలు ఇచ్చేస్తున్నారు. యజమానులు డబ్బులు వ సూలు చేసి అధికారులకు అనధికారులకు పెద్ద మొత్తంలో బుట్ట చెబుతున్నారు. దీంతో ఒక్క అధికారి కూడా ఇటుక బట్టీల వైపు కన్నె త్తి చూడడం లేదు ఎన్ని ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది.