23-05-2025 11:04:23 PM
బీసీ విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామకృష్ణ యాదవ్
మునగాల: సూర్యాపేట జిల్లా మునగాల సృష్టికి మూలం అమ్మ ఆడపిల్లని రక్షించుకోవడమే సృష్టి ధర్మం ప్రైవేట్ హాస్పిటల్లో లింగ నిర్ధారణ పరీక్షలు భృణ హత్యలు నివారించాలని బీసీ విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామకృష్ణ యాదవ్ గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... సృష్టికి మూలం అమ్మ అని ఆ పదానికి అర్థం తెలిసేలా తల్లిదండ్రులను గౌరవించి కంటికి రెప్పల కాపాడుకోవాలని అన్నారు. అమ్మ అనే పదానికి అర్థం వచ్చేలా రాష్ట్రంలో లింగ నిర్ధారణ పరీక్షలు చేయకుండా కఠిన చట్టం తీసుకురావాలని అలాగే పేదరికంలో మగ్గి చాలీచాలని వేతనాలతో బ్రతుకులు వెల్లదీస్తున్న పేదలు పిల్లల్ని సాదుకోవడానికి చదువు చెప్పించడానికి సరిపడ డబ్బులు లేక ప్రైవేట్ హాస్పిటల్ లో దోపిడీ కారణంగా ఆడపిల్లలను చంపుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
లింగ నిర్ధారణ పరీక్షలు భ్రూణ హత్యలు చేసేవారిపట్ల కఠినంగా వ్యవహరించి స్కానింగ్ సెంటర్లలో ఆపరేషన్ థియేటర్లలో సీసీ ఫుటేజ్ పర్యవేక్షణలో పరీక్షలు ఆపరేషన్లు చేయాలని అలాగే ఉన్నత చదువులు చదువుకున్న డాక్టర్లు తల్లిదండ్రులకు ఆడపిల్లలకు ప్రభుత్వం ప్రవేశపెట్టి పథకాల గురించి వివరించి వారిని కౌన్సిలింగ్ చేసి లింగ నిర్ధారణ పరీక్షలు బ్రుణ హత్యలు నివారించాలని పరిస్థితి ఇలానే చేస్తే ఈ భూమి మీద అమ్మ అనే పదమే వినిపించదని ఆడపిల్లను రక్షించుకోవడం సృష్టి ధర్మమని పేర్కొన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు భృణ హత్యలు చేస్తున్న హాస్పటల్ డాక్టర్ ల పట్టాను రద్దు చేసేలా చట్టం ప్రభుత్వం చేయాలని త్వరలో ప్రైవేట్ హాస్పటల్ దోపిడీ లింగ నిర్ధారణ పరీక్షలు బృణ హత్యల పట్ల ఇంత పాపం జరుగుతున్న కాసులకు కక్కుర్తి పడి మెడికల్ అధికారులు హాస్పటల్లో డాక్టర్లపై ఎలాంటి చర్యలు తీసుకోపోవడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మానవ హక్కుల కమిషన్కు నివేదిక సమర్పిస్తామని అలాగే బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తానని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.