7 July, 2026 | 2:55 PM

Breaking News

సుద్దాలలో ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం, మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పత్రాలు అందజేత   •   ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు   •   పదవీ విరమణ సేవలకు మాత్రమే… వ్యక్తిత్వానికి కాదు   •   గోపాల్పేట్ గ్రామంలో నూతన సీసీ రోడ్డు పనులు ప్రారంభం   •   బీజేపీలో భారీ మార్పులకు రంగం సిద్ధం?   •   మరోసారి అవకాశం ఇస్తే.. మరింత అభివృద్ధి చేస్తాం   •   TRS పార్టీ పేరుపై ఢిల్లీ హైకోర్టుకు కవిత   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలే లక్ష్యం   •   మార్వాడీ యువ మంచ్ ఆధ్వర్యంలో ఉచిత ఫ్రీజర్ బాక్స్ ప్రారంభం   •  

బాల్య వివాహాలను అరికట్టాలి

22-06-2025 07:01 PM

నాగారం: బాల్య వివాహాలు, అక్రమ దత్తత, బాల కార్మిక వ్యవస్థను అరికట్టాలని మండల వైద్యాధికారి డాక్టర్‌ బొమ్మగాని హర్షవర్థన్‌(Mandal Medical Officer Dr. Bommagani Harshvardhan) అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యశాఖ ఆధ్వర్యంలో బాల వివాహాల నిర్మూలన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... చిన్న వయస్సు బాల్య వివాహాలు చేసుకుంటుంటే ఆరోగ్యపరంగా అనేక అనర్థాలకు దారితీస్తుందన్నారు. పిల్లల దత్తతను చట్టపరంగా తీసుకోవాలని, బాల కార్మికులను పనిలో పెట్టుకోకూడదన్నారు. ఈ కార్యక్రమంలో సీహెచ్‌వో మాలోతు బిచ్చునాయక్, హెచ్‌ఈ విమల, పీహెచ్‌ఎన్‌ అరుణ కుమారి, సూపర్‌ వైజర్‌ రామచంద్ర, జిల్లా కౌన్సిలర్‌ శోభారాణి, యాదగిరి, ప్రవీణ్‌రెడ్డి, నాగరాజు పాల్గొన్నారు.