17-07-2025 12:21:45 AM
నిజాంసాగర్, జూలై 16(విజయక్రాంతి), కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలకేంద్రానికి చెందిన బీ లక్ష్మి ( 26 )అనే మహిళ నాల్గవ కాన్పు పురిటి నొప్పులు రావడంతో బుధవారం నిజాంసాగర్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ నుంచి బాన్సువాడ హాస్పిటల్ కి వెళ్లాలని 108 కి సమాచారం ఇచ్చారు.
వారు హఠాహుటిన చేరుకుని బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో నొప్పులు అధికం కావడంతో క్లిష్ట పరిస్థితుల్లో 108 సిబ్బంది డెలివరీ చేయడంతో పండంటి మగబిడ్డ కీ జన్మనిచ్చింది. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని డెలివరీ అనంతరం వారిని బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇ.యం .టి అరవింద్, పైలెట్ వెంకటేష్ లకు వారి కుటుంబ సభ్యులు అభినందనలు తెలిపారు.