calender_icon.png 17 July, 2025 | 2:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హనుమాన్ మందిరం చుట్టూ షట్టర్లు నిర్మించొద్దు

17-07-2025 12:23:01 AM

జుక్కల్, జులై 15 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండల కేంద్రంలోని పాత బస్టాండ్ సమీపంలో గల హనుమాన్ మందిరం చుట్టూ ఆ మందిర కమిటీ సభ్యులు షెటర్లు నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.

ఈ ఆలయం చుట్టూ షట్టర్లు నిర్మిస్తే ప్రతి సంవత్సరం అతి ఉత్సవంగా జరుపుకునే అతిపెద్ద పండుగైన రథోత్సవాలకు, ఎడ్ల పొలాల అమావాస్య పండుగకు ఇబ్బందులు ఎదురవుతాయని బుధవారం పంచాయతీ కార్యదర్శి సందీప్ కుమార్ కు రథంగల్లి యువకులు వినతి పత్రాన్ని అందజేశారు. ఉమ్మడి జిల్లాలో ఎక్కడలేని అతి పెద్ద లక్ష్మీనారాయణ వ్రతం మద్నూర్ మండల కేంద్రంలోని ఉంది.

ఈ హనుమాన్ ఆలయం చుట్టూ షట్టర్ల నిర్మాణం జరగకుండా చూడాలని ఆ వినతిపత్రంలో యువకులు కోరారు. ఇందుకు సెక్రెటరీ సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. తన వంతు ప్రయత్నం చేస్తానని హామి ఇచ్చారని సమాచారం. ఈ కార్యక్రమంలో బొగ్గుల్ వార్ సంజు, నాగేష్ రౌతు వార్, చాట్ల వార్ హనుమాన్లు, అవార్వార్ హనుమాన్లు, శంకర్ రౌతు వార్, మానూర్ వార్ కిరణ్, పలువురు యువకులు పాల్గొన్నారు