14 July, 2026 | 4:17 PM

Breaking News

ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో 100% పూర్తి చేయాలి: ఎస్ఐఆర్ నియోజకవర్గ ఇన్చార్జి.   •   డిగ్రీ కళాశాల వద్ద శాశ్వత బస్ స్టాప్ ఏర్పాటు చేయాలి   •   కుకునూరుపల్లి ఫోటోగ్రాఫర్ యూనియన్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక   •   ఒక్క ఓటరు నష్టపోవద్దు   •   ట్యాలీ ఆధారిత అకౌంటింగ్ స్కిల్స్ విద్యార్థులు నేర్చుకోవాలి   •   బస్సులో టెన్త్ మెమో పోగొట్టుకున్న విద్యార్థి   •   ఫీజు రీయంబర్స్ మెంట్ ను విడుదల చేయాలి   •   సుధాకర్ కుటుంబానికి ఆర్ధిక సహాయం చేసిన కాంగ్రెస్ నాయకులు   •   తెలంగాణలో SIR గడువు పెంచాలని విజ్ఞప్తి చేశాం: మంత్రి పొన్నం   •   మోదీ, అమిత్ షా స్పందిచరెందుకు?.. 23న మౌనదీక్ష చేస్తా: వీహెచ్   •  

ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి

23-06-2025 04:44 PM

యంగ్ స్టార్ యూత్ అధ్యక్షులు షేక్ షకీల్..

ఖానాపూర్ (విజయక్రాంతి): జిల్లాలో రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని, ఇందుకోసం ఆదేశాలు జారీ చేయాలని ఖానాపూర్ యంగ్ స్టార్ యూత్ అధ్యక్షులు షేక్ షకీల్(Young Star Youth President Sheikh Shakeel), కార్యదర్శి అల్హజ్ కోరారు. ఈ మేరకు సోమవారం నిర్మల్ జిల్లా ప్రజావాణిలో కలెక్టర్కు విజ్ఞాపన పత్రం అందజేశారు.

ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదివితే ప్రభుత్వం నుంచి కనీస మౌలిక సదుపాయాలు పాఠశాలలో ఏర్పాటు చేస్తారని, దాంట్లో బీద కుటుంబాల పిల్లలు కూడా మంచిగా చదువుకునే అవకాశం ఉంటుందని, కనీస వసతులు లేక పాఠశాలలో విద్యార్థినీ విద్యార్థులు అనేక ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని వారు అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకుంటున్న వ్యక్తులు ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు వెనకాడుతున్నారని, ఈ మేరకు అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ జిల్లా విద్యాశాఖ అధికారికి ఆదేశాలు జారీ చేసినట్లు వారు తెలిపారు.