14 July, 2026 | 4:59 PM

Breaking News

అబాకస్ పోటీల్లో రాష్ట్ర స్థాయి విజేతలుగా బ్లూ బెల్స్ విద్యార్థులు   •   రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు కేరళ మోడల్ హై స్కూల్ విద్యార్థులు   •   20లోగా ఓటర్ల సవరణ పూర్తి చేయాలి: కలెక్టర్ రాహుల్ శర్మ   •   ఓటరు సర్ లో పాల్గొన్న నగర మేయర్ కొలగాని   •   ప్రతి ఒక్కరు SIR ప్రక్రియను సద్వినియోగించుకోవాలి   •   రక్తాన్ని పొలాల్లో చల్లి రైతుల నిరసన   •   పెండింగ్ స్కాలర్‌షిప్‌లపై ఆందోళనకు ముందస్తు అరెస్టులు   •   వరికి ప్రత్యామ్నాయంగా రైతులు అపరాలు పండించాలి: ఏఓ చంద్రశేఖర్ రెడ్డి   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో 100% పూర్తి చేయాలి: ఎస్ఐఆర్ నియోజకవర్గ ఇన్చార్జి.   •   డిగ్రీ కళాశాల వద్ద శాశ్వత బస్ స్టాప్ ఏర్పాటు చేయాలి   •  

ప్రజా సమస్యల పరిష్కార మార్గమే ప్రజావాణి

23-06-2025 04:40 PM

జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్..

జనగామ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలో సోమవారం రోజున ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ ఆఫీసులో ప్రజావాణి నిర్వహించడం జరిగింది. ఇట్టి ప్రజావాణి కార్యక్రమంలో భూభారతి తరపున 100 అర్జీలు రావడం జరిగింది. వీటిని వెనువెంటనే పరిష్కరించాలని కలెక్టర్ రిజ్విన్ భాషా షేక్(Collector Rizwan Basha Shaik), సంబంధిత శాఖ అధికారులను ఆదేశించడం జరిగింది. ఈ ప్రజావాణిలో భాగంగా 74 అర్జీలు రావడం జరిగింది. నరవాడ మండలం సూర్య బండ తండాకు చెందిన అనిత, తమకు ఇల్లు లేదని ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకోవడం జరిగింది.

జనగామ మున్సిపాలిటీ పరిధిలోని హనుమకొండ రహదారిలో సర్వేనెంబర్ 56 వెంచర్ పై ఉన్న కోర్టు కేసు కొట్టేశారని ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు తమకు అనుమతి ఇవ్వాలని పట్టాదారు వీరారెడ్డి కలెక్టర్ ను విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇట్టి ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు పింకేష్ కుమార్, రోహిత్ సింగ్, డిప్యూటీ కలెక్టర్ సుహాసిని, ఆర్డీవోలు గోపి రామ్, హనుమంతు నాయక్, డిఆర్డిఓ వసంత, డి హెచ్ ఎస్ఓ శ్రీధర్, డిపిఆర్ఓ శ్రీనివాస్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.