18-07-2025 12:00:00 AM
టీయూడబ్ల్యూజే (ఐజేయు) సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కోలా నాగేశ్వరావు
హుజూర్ నగర్, జూలై 17: జిల్లాలో ఉన్న అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీతో విద్యను అందించాలని టియుడబ్ల్యూజే (ఐజేయు) సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కోలా నాగేశ్వరావు అన్నా రు. గురువారం పట్టణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లా విద్యాశాఖ అధి కారి రాయితీ కల్పించాలని ఉత్తర్వులు జారీచేసిన హుజూర్ నగర్ లోని కొన్ని పాఠశా లలు మాత్రం అమలు చేయడం లేదన్నారు.
వర్కింగ్ జర్నలిస్టులు ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా నిరంతరం పని చేస్తున్నారన్నారు. జర్నలిస్టులు జీతభత్యాలు లేకుండా సమాజానికి సేవలు అందిస్తున్నారన్నారు. కావున అధికారులు పాఠశాలల్లో వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు 50శాతం ఫీజు రాయితీలను అమలయ్యేలా చూడాలన్నారు. ఇదే విషయంపై మండల విద్యాధికారితో మాట్లాడగా అన్ని పాఠశాలల యాజమాన్యాలతో మాట్లాడి రాయితీ అమలు అయ్యేలా చూస్తామనీ చెప్పారన్నారు.