calender_icon.png 18 July, 2025 | 2:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిరిజన తండాలో సమస్యలు పరిష్కరించాలి..!

17-07-2025 11:03:27 PM

జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్

సంగారెడ్డి,(విజయక్రాంతి): సిర్గాపూర్ గ్రామాలలో అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం తగదని జాతీయ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ అన్నారు. గురువారం సంగారెడ్డి కలెక్టరేట్లో జిల్లాలోని రోడ్లు భవనాలు,  శిశు సంక్షేమ శాఖ, విద్యాశాఖ, వైద్య ఆరోగ్య శాఖ, వ్యవసాయం శాఖ ,జిల్లా గ్రామీణ సంస్థ, నీటిపారుదల శాఖ, పరిశ్రమల శాఖ, రెవెన్యూ, పోలీస్, వివిధ సంబంధిత  శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హుస్సేన్ మాట్లాడుతూ... జిల్లాలో గ్రామీణ ప్రాంతాలు గిరిజన తండాల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలన్నారు. గిరిజన తండాలలో మౌలిక వసతుల కల్పనకు అధికారులు కృషి చేయాలన్నారు.

జాతీయ ఎస్టి కమిషన్ వస్తే అధికారులు అందరూ తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. గిరిజన బిడ్డలకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలపై అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. తండాలకు తాగునీటి వసతి, రోడ్డు సౌకర్యాల కల్పనపై అధికారులు ముందుగా దృష్టి సారించాలని సూచించారు. గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో మెరుగైన వసతులు కల్పించాలని అధికారులకు ఆదేశించారు. గిరిజనులు ఎన్నో ఏళ్లుగా సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలు అందించాలన్నారు. 

ఈ సమీక్షకు ముందు ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ తో కలిసి నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని గైరాన్ తండాను సందర్శించారు. ఈ సందర్భంగా తాండావాసులు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను కమిషన్ సభ్యుల దృష్టికి తీసుకొచ్చారు. తండాకు వెళ్లే దారిలో వాగు ఉండడంతో వర్షాకాలంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు . తండాకు చెందిన విద్యార్థులు పాఠశాలలకు వెళ్లాలన్న  కష్టమేనని తెలిపారు .   మూడు నెలల లోపు తాండకు మెరుగైన రోడ్డు వసతి, బ్రిడ్జి సౌకర్యం కల్పించాలని ఆయన  కలెక్టర్కు, ఆర్ అండ్ బి శాఖ అధికారులను  కమిషన్ సభ్యులు ఆదేశించారు.