calender_icon.png 18 July, 2025 | 2:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అకాల వర్షం, ఈదురు గాలుల బీభత్సం.. రహదారికి అడ్డంగా భారీ వృక్షాలు

17-07-2025 11:07:26 PM

సహాయకంగా నిలిచిన ఎస్ఐ గోపికృష్ణ

పెన్ పహాడ్ : సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ లో గురువారం రాత్రి కురిసిన అకాల వర్షం, ఈదురు గాలుల బీభత్సానికి సూర్యాపేట - నేరేడుచర్ల ప్రధాన రహదారికి మాచారం సమీపంలో రహదారికి ఇరు వైపుల ఉన్న భారీ వృక్షాలు నేలకొరిగాయి. దీంతో ప్రయాణికులకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోగా సమాచారం అందుకున్న పెన్ పహాడ్ ఎస్ఐ గోపికృష్ణ అక్కడికి చేరుకొని ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఉండాలని తన సిబ్బందితో కలిసి అడ్డంగా ఉన్న చెట్లను తొలగించడంలో సహాయకంగా నిలిచారు. సకాలంలో సహాయక చర్యలు చేపట్టడంపై ప్రయాణికులు పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.