29 April, 2026 | 9:24 PM

Breaking News

భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న వీరబ్రహ్మేంద్రస్వామి వార్షికోత్సవ వేడుకలు.   •   పెట్రోల్ కృత్రిమ కొరత సృష్టిస్తే... క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం   •   టెన్త్ ఫలితాల్లో ఎంజెపీటీసీడబ్ల్యూఆర్ విద్యార్థినుల ప్రతిభ   •   పార్టీ పెట్టడం అంటే పాన్ షాప్ పెట్టినట్లు కాదు   •   పదిలో మెరిసిన జవహర్ నగర్ పేదింటి ఆణిముత్యాలు   •   పదో తరగతి ఫలితాల్లో శత శాతం ఉత్తీర్ణత   •   విధి నిర్వహణలో అలుపెరుగని శ్రామికుడికి విరామం   •   జిల్లా ద్వితీయ స్థానంలో మేకల జ్ఞానేశ్వరి   •   పదవ తరగతి ఫలితాల్లో కేజీవీబీ, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రతిభ   •   ఖానాపూర్‌లో కృష్ణవేణి హై స్కూల్ విద్యార్థుల విజయపరంపర   •  

చిన్నారులకు నాణ్యమైన ఆహారం అందించాలి

19-03-2025 12:00 AM

జనగామ, మార్చి 18(విజయక్రాంతి): అంగన్‌వాడీల్లో పిల్లలకు నాణ్యమైన ఆహారం అందించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్  సూచించారు. మంగళవారం జనగామ మండలంలోని మరిగడి గ్రా మ పంచాయతీలోని ఎంపీపీఎస్ పాఠశాల పరిధిలో గల అంగన్వాడీ కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు.

పిల్లలకు అందించే ఆహారాన్ని పరిశీలించి, చిన్నారులకు అందించే ఆహా రంపై జాగ్రత్తగా వ్యవహరించాలని, నిరంతరం అప్రమత్తంగా ఉంటూ నాణ్యమైన కూరగాయలు, ఆకుకూరలతో శుచిరుచికరమైన భోజనాన్ని అందించాలని సూచించారు. 

వంట పాత్రలను తనిఖీ చేసి, కేంద్రంలోనూ, ఆహారం వండే వంట పాత్రల విషయంలో పరిశుభ్రతను పాటించాలని పేర్కొన్నారు. కేంద్రానికి వచ్చిన గుడ్ల నాణ్యతను పర్యవేక్షించి, కొలత ప్రకారంగా గుడ్లు ఉండేలా సరిచూసుకోవాలన్నారు. పర్యవేక్షణలో కలెక్టర్ వెంట జీసీడీఓ గౌసియా బేగం, సంబంధిత అధికారులు, అంగన్వాడీ టీచర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు