calender_icon.png 15 November, 2025 | 12:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బదిలీలు సహజం.. సమాజ సేవలు శాశ్వతం

14-11-2025 11:42:09 PM

చిట్యాల సీఐ మల్లేష్ యాదవ్

చిట్యాల,(విజయక్రాంతి): ఉద్యోగంలో బదిలీలు సహజమని,కానీ మనం చేస్తున్న సమాజ సేవలు ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతాయని చిట్యాల సీఐ మల్లేష్ యాదవ్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి పోలీస్ స్టేషన్ లో గత నాలుగు సంవత్సరాలుగా రైటర్ గా డ్యూటీ చేసిన మోహన్ వరంగల్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ కు, మహిళా కానిస్టేబుల్ గా పనిచేసిన భవాని టేకుమట్ల పోలీస్ స్టేషన్ కు బదిలీపై వెళుతున్న సందర్భంగా మొగుళ్ళపల్లి పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆధ్వర్యంలో వారిని శాలువాలతో ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ పోలీసులు అంటేనే సమాజంలో ప్రజలను రక్షించే భటులని, ఈ క్రమంలో మనం చేస్తున్న వృత్తి కఠినత్వంలో ఉన్న.. సమాజానికి మేలు చేయడంలో ఎంతో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. మనం చేస్తున్న ఉద్యోగంలో ప్రజల సేవకుడిగా మన్ననలు పొందడం ఎంతో అదృష్టమని..అలాంటి కోవలోకి బదిలీపై వెళుతున్న రైటర్ మోహన్, మహిళా కానిస్టేబుల్ భవాని వస్తారన్నారు. వారు ఎక్కడ విధులు నిర్వహించిన మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలని, ఉన్నతాధికారుల ప్రశంసలు పొందాలన్నారు.ఆ భగవంతుడి ఆశీర్వాదంతో ఉన్నతమైన స్థానానికి ఎదగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఎస్సై బోరగాల అశోక్,పోలిస్ సిబ్బంది పాల్గొన్నారు.