calender_icon.png 2 January, 2026 | 9:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైన్స్ ఫెయిర్‌లో ఆకట్టుకున్న పిల్లల ప్రాజెక్టు

02-01-2026 08:16:36 PM

బేల,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని స్థానిక ఉర్దూ మీడియం ప్రాథమిక కొన్నత పాఠశాలలో నిర్వహించిన సైన్స్ ఫెయిర్ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ భాగ్యలక్ష్మి హాజరైయ్యారు. పాఠశాలలో విద్యార్థులు పలు రకాల ప్రాజెక్ట్ వర్క్స్ సొంతంగా తయారు చేసి ప్రదర్శనలో ఉంచి, వాటి పనితీరును వివరించారు.

ఈ సందర్బంగా గ్రామ సర్పంచ్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ... విద్యార్థుల నైపుణ్యం వెలికితీయాలంటే సైన్స్ ఫెయిర్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. పిల్లలు చదవడం, వినడం కంటే స్వయంగా ప్రాజెక్ట్ లు తయారు చేయడం ద్వారా పిల్లల నైపుణ్యం పెరుగుతుందని అన్నారు. విద్య ద్వారానే బంగారు భవిష్యత్తు ఉంటుందని అందుకే పిల్లలు మొబైల్ ఫోన్ లకు దూరంగా ఉండాలని సూచించారు.