02-01-2026 09:35:29 PM
అంగన్వాడీ కేంద్రానికి త్వరలో నూతన భవనం
కోతులను పట్టే కార్యక్రమం ప్రారంభం
ఎన్నికలలో ఇచ్చిన హామీలన్నీ తప్పకుండా నెరవేరుస్తా: సర్పంచ్ విజయలక్ష్మి లింగస్వామి
సంస్థాన్ నారాయణపూర్,(విజయక్రాంతి): ప్రతిఒక్కరు తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తద్వారా గ్రామాన్ని ఆదర్శంగా ఉంచుకోవడానికి సహకరించాలని సంస్థాన్ నారాయణపూర్ సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి అన్నారు. పారిశుద్ధ్య వారోత్సవాలలో "ఫ్రైడే -డ్రైడే"లో భాగంగా గ్రామంలోని పదవ వార్డును వార్డు సభ్యులు నీళ్ళ అనిత శంకర్ తో కలిసి సందర్శించారు. వార్డులోని ప్రజలతో కలిసి తిరుగుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి గర్భిణీ స్త్రీలు పిల్లలతో మాట్లాడారు.
అంగన్వాడీ కేంద్రానికి సొంత భవనం లేక పిల్లలు గర్భిణీలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకుని సొంత భవనం నిర్మాణానికి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో త్వరలోనే ఏర్పాట్లు చేస్తానని గర్భిణీలకు పిల్లలు కూర్చోవడానికి బెంచీలు అవసరమైన సామాగ్రి ఏర్పాటు చేస్తానని తెలిపారు. పదవ వార్డులో అంతర్గత కాల్వల నిర్మాణానికి త్వరలోనే పరిష్కారం చూపుతామని తెలిపారు. గ్రామంలో కోతుల బెడదను తొలగించడానికి చర్యలు చేపట్టామని వారం రోజుల్లో కోతుల బెడద తొలిగి పోతుందని అన్నారు.గ్రామ ప్రజల సహకారంతో గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని తెలిపారు.