calender_icon.png 2 January, 2026 | 11:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్నేహితుని కుటుంబానికి ఆర్ధిక సహాయం

02-01-2026 09:27:45 PM

చిట్యాల,(విజయక్రాంతి): చిట్యాల పట్టణకేంద్రానికి చెందిన గుంటోజు వెంకన్న చారి ఇటీవల గుండె నొప్పితో మృతి చెందడంతో శుక్రవారం 1995-96 పదవ తరగతి చదివిన స్నేహితులు మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి 26,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవిష్యత్తులో కూడా స్నేహితుని కుటుంబ సభ్యులకు అండగా ఉంటూ ఎలాంటి సాయమైన చేయడానికి సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు.