02-01-2026 09:25:43 PM
-60 పశువులకు గర్భకోశ వ్యాధి నివారణ చికిత్స
-పాడి రైతులకు అండగా పశుసంవర్ధక శాఖ.. ఉచితంగా మందుల పంపిణీ
కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండలం కొండాపూర్ గ్రామంలో శుక్రవారం తెలంగాణ పశుగణాభివృద్ధి సంస్థ, పశుసంవర్ధక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత గర్భకోశ వ్యాధి నివారణ చికిత్స శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా మండల పశువైద్యాధికారులు డాక్టర్ అంజిరెడ్డి, డాక్టర్ సాహితీ మాట్లాడుతూ... పాడి పశువులలో వచ్చే గర్భకోశ వ్యాధుల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని, సరైన సమయంలో చికిత్స అందించడం వల్ల పాడి దిగుబడి పెరుగుతుందని సూచించారు.
ఈ శిబిరంలో సుమారు 50 గేదెలు, 10 ఆవులకు గర్భకోశ పరీక్షలు నిర్వహించి, వ్యాధి లక్షణాలు ఉన్న పశువులకు అవసరమైన చికిత్స అందించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వంకాయల గౌతమి ప్రశాంత్, ఉపసర్పంచ్ రాజిరెడ్డి పాల్గొని ప్రభుత్వ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో గోపాల మిత్ర సూపర్వైజర్ రాములు, గోపాలమిత్రులు దినేష్, శ్రీకాంత్, పశువైద్య సిబ్బంది కనుకలక్ష్మి, తిరుపతిరెడ్డిలతో పాలకేంద్రం ప్రెసిండెంట్ సంజీవరెడ్డి మరియు సెక్రెటరీ సత్యనారాయణ పాటు సుమారు 60 నుంచి 70 మంది పాడి రైతులు పాల్గొన్నారు. పశువులకు మెరుగైన వైద్యం అందించిన వైద్యులకు, సిబ్బందికి ఈ సందర్భంగా రైతులు కృతజ్ఞతలు తెలిపారు.